Mumbai, April 15: విమాన కంపెనీలు (Airline Firms) ప్రయాణికులకు షాకిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 దాకా పొడిగించడంతో (Extension of Lockdown) పాటు విమానసేవలను కూడా అప్పటిదాకా రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ చార్జీలు రీఫండ్ చేయరాదని (Airline Firms Declined Refund) నిర్ణయించాయి. అదనపు రుసుములేమీ లేకుండా ప్రయాణికులు మరో తేదీకి టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చని ప్రకటించాయి.
39 లక్షల రైల్వే టికెట్లు రద్దు, ఇప్పటికే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నవారికి మొత్తం రీఫండ్
కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల ప్రకారం మే 3 దాకా మా కార్యకలాపాల నిలిపివేతను పొడిగిస్తున్నాం. టికెట్ల రద్దు ప్రక్రియ జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా ప్రయాణికులు ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది‘ అని విమానయాన సంస్థ విస్తార ప్రతినిధి తెలిపారు. ప్రియమైన వినియోగదారులా.. మీరు కొన్న టికెట్లకు నో రీఫండ్’ అని హెచ్చరించాయి.
ఈ నెల 14న లాక్‌డౌన్ ఎత్తేసారని లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నాయి. అయితే ప్రధాని మోదీ మూసివేతను మే 3వరకూ పొడిగించడంతో అన్ని సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే టికెట్ల మాదిరే తమకూ రిఫండ్ చేస్తారని విమాన ప్రయాణికులు ఆశించారు. కానీ ఎయిర్ లైన్స్ సంస్థలు షాకిచ్చాయి. అలాంటి రిఫండ్స్ ఏమీ ఉండవని పలు కంపెనీలు స్పష్టం చేశాయి.
దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్
ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకూ బుకింగ్‌లను రద్దు చేశామని, ఆ టికెట్లకు రిఫండ్ ఉండవని వెల్లడించాయి. టికెట్లు తీసుకున్న వారు మాత్రం.. లాక్‌డౌన్ తర్వాత వాటిని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నాయి. అవి ఈ ఏడాది చివరవరకూ చెల్లుబాటు అవుతాయని పేర్కొంటున్నాయి. కాగా స్పైస్‌జెట్ లాంటి కంపెనీలు 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ టికెట్లను వాడుకోవచ్చని తెలిపాయి. ఇండిగో, విస్తారా లాంటి ఎయిర్‌లైన్స్ మాత్రం 2020 డిసెంబర్ 31వరకూ వాడుకోవచ్చని తెలియజేశాయి. ఇక రీషెడ్యూలింగ్ స్కీమ్ వెసులుబాటును ఏప్రిల్ 30 దాకా ప్రయాణాల బుకింగ్స్‌కు వర్తింపచేస్తున్నట్లు గోఎయిర్ పేర్కొంది.
లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు
ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్నది తెలియకుండా విమానయాన సంస్థలు ముందస్తుగా టికెట్లు జారీ చేయడం సరికాదని, వినియోగదారులను నష్టపర్చే ఈ అంశాన్ని సత్వరం సమీక్షించుకోవాలని సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది.