Akhilesh Yadav (Photo Credits: Twitter)

Lucknow, January 2: కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునేది లేదని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. బీజేపీ స‌ర్కార్ ఇస్తున్న వ్యాక్సిన్‌ను తాను న‌మ్మ‌ను అని, ఇప్పుడైతే తానేమీ కోవిడ్ టీకాను తీసుకోవ‌డం లేద‌ని (Won't Get Vaccinated For Now) స‌మాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాద‌వ్ అన్నారు. బీజేపీ వ్యాక్సిన్‌ను తానెలా నమ్ముతానని ( Cannot Trust BJP's Vaccine) ఎదురు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు యూపీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఆయన ప్రకటించారు.

మరోవైపు గుండెపోటుతో మరణించిన రైతు ఘటనపై కూడా అఖిలేశ్ స్పందించారు. బీజేపీకి ఏమాత్రం హృదయం లేదని ఇట్టే అర్థమైపోతోందని ట్వీట్ చేశారు. ‘‘నూతన సంవత్సరం ప్రారంభమైన తొలి వారంలోనే ఓ రైతు అమరుడయ్యాడు. తీవ్రమైన చలికి, పొగమంచుకు తట్టుకోలేక ప్రాణాలను వదిలాడు. అయినా అధికార పక్షానికి బాధలేదు. ఇంతటి కఠినత్వం బీజేపీలో ఎన్నడూ చూడలేదు.’’ అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు.

అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, తొలి విడతలో మూడు కోట్ల మందికి మాత్ర‌మే ఉచిత టీకా, వ్యాక్సినేషన్ డ్రై రన్ తీరును సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్

కాగా ఇవాళ్టి నుంచి దేశ‌వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై ర‌న్ (Corona Vaccine Dry Run) మొద‌లైన విష‌యం తెలిసిందే. ప‌లు ప‌ట్టణాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో డ‌మ్మీ టీకాల‌ను ఇస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాకు అనుమ‌తి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. నిపుణుల క‌మిటీ ఆ టీకాకు ఆమోదం తెలిపింది.

కోటి మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, దేశంలో తాజాగా 19,078 మందికి కరోనా, 24 గంట‌ల్లో 224 మంది మృతి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ టీకాను ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. అయితే తొలి విడత‌లో కేవ‌లం మూడు కోట్ల మందికి మాత్ర‌మే ఉచిత టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మొద‌టి విడత‌కు సంబంధించి మ‌రో 27 మంది కోట్ల గురించి వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. ఉచిత వ్యాక్సిన్ తీసుకోనున్న మొద‌టి మూడు కోట్ల మందిలో కోటి మంది హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు ఉంటార‌ని ఆయ‌న అన్నారు. ఇవాళ ఢిల్లీలో టీకా డ్రై ర‌న్ సంద‌ర్భంగా ఆయ‌న ఓ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించారు.