Guntur, Febuary 10: ఏపీలో (Andhra Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఈ విషాద ఘటన (Guntur Terrific Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరు మృతి చెందారు. మినీ లారీ - ఆటో ఢీకొనటంతో (auto-rickshaw collision) ఈ ప్రమాదం జరిగింది.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లుతెలిపారు.
నర్సారావు పేట నుంచి పుట్టకోట గ్రామానికి వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న మినీలారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. వీరంతా కూడా నర్సరావుపేట సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Here's ANI Tweet
Andhra Pradesh: 6 people killed in a collision between an auto-rickshaw and a mini lorry at Repudi village in Phirangipuram Mandal, Guntur district.
— ANI (@ANI) February 10, 2020
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని తక్షణమే మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ముగ్గురిని పుట్టకోట గ్రామానికి చెందిన రమాదేవి, మణికంఠ, యశస్వినిగా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు.