Tirumala, December 8: తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Srivari laddu)తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించడంతో.. లడ్డుల తయారీ నిలిచిపోయింది.
బూందీ తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటలను అదుపుచేసే క్రమంలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
బూందీ (boondi) తయారు చేస్తుండగా 19వ పొయ్యిలో నెయ్యి పోసే సమయంలో కాస్త పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో బూందీ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. బూందీ సిబ్బంది వెంటనే విజినెల్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
విజిలెన్స్ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బూందీ పోటులోని పైకప్పు, గోడలకు జిడ్డు అధికంగా ఉండడంతో మంటల తీవ్ర పెరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులతో పాటు లడ్డు కౌంటర్ల వద్ద ఉన్న వారు భయంతో పరుగులు తీశారు.