Amaravathi, December 18: పరిపాలనలో దూకుపోతున్న వైయస్ జగన్ సర్కారు( YS Jagan GOVT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగిన పలు ఉద్యమాల్లో పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పెట్టిన కేసులను..జనవరి 2016 లో తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు ఫ్రభుత్వం తెలిపింది.
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులో అనంతపురం, గుంటూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో నమోదైన కేసులను ఎత్తివేస్తూ హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో పాటుగా నిన్న ఏపీ శాసనసభ సమావేశాల్లో (AP Assembly session)ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్(AP CM YS Jagan) సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిపై (AP Capital) అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ రావొచ్చన్నారు.రాజధాని ఒకే చోట ఉండాలన్న ఆలోచన ధోరణి మారాలని, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని ఏపీ సీఎం వెల్లడించారు.
ఏపీలో మూడు రాజధానులు (3 Capitals) అవసరం ఉందన్నఏపీ సీఎం జగన్.. రాష్ట్రానికి 3 రాజధానులు వస్తాయేమో అంటూ ఇన్ డైరక్టుగా రాజధాని సస్పెన్స్ ని తొలగించే ప్రయత్నం చేశారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందన్న సీఎం జగన్ ఏపీకి బహుశా మూడు రాజధానులు ఉంటాయేమో అని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కమిటీ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.