Ap cm ys-jagan-serious-over-name-change-abdul-kalam-pratibha-award (photo-Twitter)

Amaravathi, November 5: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం (Abdul Kalam) పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (వెంటనే ప్రతిభా పురస్కారాలు పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆదేశించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరునే పురస్కారాలకు కొనసాగించాలన్నారు.

అంతేకాకుండా మహనీయుల పేర్లను అవార్డులకు పెట్టాలని సూచించారు. గాంధీ, అంబేద్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలన్నారు.

10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అందించే ప్రతిభ అవార్డులకు పేరును మార్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల ప్రకారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు మీద ఇచ్చే ఈ అవార్డును వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుగా మార్చారు.

పేరు మార్చినట్లుగా వచ్చిన జీవో

ప్రతి ఏటా అబ్దుల్ కలాం పుట్టినరోజు నాడు ప్రతిభ అవార్డులు కింద విద్యార్థులకు ఇచ్చే ఈ అవార్డు పేరును.. (Dr. A. P. J Abdul Kalam Pratibha Puraskar)ను తాజాగా ఈ పేరుని (YSR Vidya Puraskar)గా మార్చేశారు.

ఈ జీవోపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)స్పందించారు. అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారని ప్రతిభా పురస్కారాలకు ఆయన పేరు పెట్టామని జగన్ సర్కార్ దీన్ని కూడా మార్చడం సరికాదన్నారు. ఇది ఆయన్ను అవమానించడమేనన్నారు చంద్రబాబు. జీవోపై విమర్శలు రావడంతో సీఎం స్పందించారు. జీవోను రద్దు చేయమని ఆదేశించారు.