New Delhi, Mar 22: ఢిల్లీ లిక్కర్ విధానం కేసులో ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను 6 రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. లిక్కర్ విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసిన ఈడీ.. శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత తొలిసారిగా స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జైలులో ఉన్నా బయట ఉన్నా నా జీవితం దేశానికే అంకితమని వెల్లడి
ఈ కేసులో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. రెండున్నర గంటల పాటు వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ అంశంపై తాజాగా తీర్పును వెలువరించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు, కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి సహా పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.మద్యం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది