Population(Photo-ANI)

జనాభాలో చైనాను భారత్‌ ఇప్పటికే అధిగమించి తొలిస్థానానికి చేరుకున్నట్లు వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ (WPR) అంచనా వేసింది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ ప్రకారం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించినట్లు పేర్కొంది.

వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ (WPR) రివ్యూ ప్రకారం.. 2022 చివరినాటికే భారత్‌ జనాభా 141.7కోట్లు కాగా తాజాగా (జనవరి 18, 2023 నాటికి) ఈ సంఖ్య 142.3 కోట్లుకు చేరుకున్నట్లు అంచనా. మరో అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్‌ (Macrotrends) కూడా ప్రస్తుతం భారత జనాభా 142.8కోట్లుగా లెక్క కట్టింది. ఇవి చైనా ఇటీవల ప్రకటించిన జనాభా (141.2కోట్లు) కంటే ఎక్కువ.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉండటంతో మండిపడిన కేంద్రం, డాక్యుమెంటరీపై స్పందించిన యూకే ప్రధాని రిషి సునాక్‌

దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్‌ (India) అవతరించినట్లేనని స్పష్టమవుతోంది.2050 నాటికి భారత జనాభా సుమారు 167 కోట్లకు చేరుకోవచ్చని ఐరాస అంచనా వేస్తోంది.ప్రపంచ జనాభా కూడా ఇటీవలే 800 కోట్ల మైలురాయిని దాటింది. 2022 నవంబర్‌ 15 రోజున పుట్టిన శిశువుతో జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

సిగిరెట్ తాగి పీక రోడ్డు మీద పడేశాడని రూ. 50 వేలు జరిమానా విధించిన లండన్ కోర్టు, రోడ్లన్నీ చెత్తాచెదారంగా తయారవుతున్నాయని తెలిపిన న్యాయమూర్తి

1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండగా.. 48ఏళ్లలోనే అది రెట్టింపై 800 కోట్లకు చేరుకుంది.ఇక 2021 కంటే 2022 చివరినాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) జనవరి 17న తెలిపింది.