BJP Leader, minister bandi sanjay sensational comments congress and brs merge (X)

Hyd, Nov 4: తెలంగాణలో జరగబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి (Bandi Sanjay on 2028 Telangana Elections) రావడం ఖాయమని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్ గా సమావేశమయ్యారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బస్సుయాత్ర, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర, ప్రభుత్వ పనితీరు తెలుసుకోనున్న భట్టి

దక్షిణాదికి అన్యాయం పేరుతో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, మీడియా ప్రచారం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇక బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీలో క్యాడర్‌ లేరన్నారు. ఆ పార్టీలో కొంతమంది నేతలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదాయం కోసం కాకుండా ఆలయాల్లో ప్రజలకు సేవలందిస్తామని, హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కనీసం ఐదుగురు విదేశీయులను భారత్‌లో పర్యటించేలా కృషి చేయాలని ఎన్నారైలకు ఆయన సూచించారు. దేశాభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

రాష్ట్రంలో మాజీ సర్పంచ్‌ల అరెస్టు దుర్మార్గమని, సర్పంచ్‌లు అప్పుల పాలవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. మాట తప్పిందని విమర్శించారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఇవ్వాలని విన్నవించినా చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు.అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.