కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా కేఆర్ సర్కిల్ అండర్ పాస్ నీటితో నిండిపోయింది. ఇందులో ఏపీకి చెందిన కృష్ణా జిల్లా కారు ఒకటి చిక్కుకుపోయింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉండగా వారిని సహాయక సిబ్బంది రక్షించింది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోయిన క్రమంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిని సెయింట్ మార్తాస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, పరిస్థితి విషమించడంతో భానురేఖ అనే మహిళ మృతిచెందింది. ఈమెది కృష్ణాజిల్లాలోని తేలప్రోలు.కబ్బన్ పార్క్ చూసేందుకు కృష్ణా జిల్లాకు చెందిన ఒక కుటుంబం కారులో వచ్చింది. ఈ క్రమంలోనే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద కారు నీటిలో చిక్కుకుపోగా, దానిపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కారును ఎట్టకేలకు బయటకు తీశారు.
Here's Tweet
A 22 year old girl Bhanurekha dies in the flooded KR Circle underpass in Bengaluru. Her car was stuck there. Terrifying rain. Chief Minister @siddaramaiah is at St. Martha’s hospital to meet her family members. #bengalururain
— DP SATISH (@dp_satish) May 21, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)