బీహార్ రాజధాని పాట్నా (Patna)లో ఓ క్రేన్‌ను ఆటో ఢీ కొట్టింది (Auto Hits Crane). ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.పాట్నాలోని రామ్‌లఖన్ పాత్ ప్రాంతంలో (Ramlakhan Path area) మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగమైన ఓ భారీ క్రేన్‌ను ఆటో అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మద్యం మత్తులో బస్సును నడిపిన డ్రైవర్, బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో 5 మంది మృతి, మరో 38 మందికి తీవ్ర గాయాలు, విషాదకర వీడియో ఇదిగో..
ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు పాట్నా సెంట్రల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.