Patna, Nov 4: బీహార్‌లో దీపావళి పండుగరోజు విషాదం (Bihar spurious liquor Tragedy) చోటు చేసుకుంది. సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్నఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 24 మంది (24 dead in two Bihar districts ) మరణించారు. పశ్చిమ చంపారన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి (consuming suspected spurious liquor) 24 మంది మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకెళితే..పశ్చిమ చంపారన్ జిల్లా ప్రధాన కార్యాలయం బెట్టియా వద్ద ఉన్న తెల్హువా గ్రామంలో హూచ్ సేవించి 8 మంది వ్యక్తులు మరణించగా, గోపాల్‌గంజ్‌లో అనుమానాస్పద కల్తీ మద్యం సేవించిన మరో ఘటనలో 16 మంది మరణించారు. చికిత్స ొందుతూ మరో ఆరుగురు మరణించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
అయితే జిల్లా అధికారులు. మృతులకు గల కారణాలను ఇరు జిల్లాల అధికారులు ఇప్పటి వరకు నిర్ధారించలేదని తెలిపింది. గత రెండు రోజులలో బీహార్‌లోని గోపాల్‌గంజ్ , పశ్చిమ చంపారన్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి కనీసం 24 మంది మరణించారు, పలువురు అస్వస్థతకు గురయ్యారని పీటీఐ తన కథనంలో తెలిపింది. తెల్హువా హూచ్ విషాదం ఉత్తర బీహార్‌లో గత 10 రోజుల్లో జరిగిన మూడో సంఘటన
బీహార్ మంత్రి జనక్ రామ్ గోపాల్ గంజ్ చేరుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కల్తీ మద్యం సేవించి చనిపోయిన వారి ఇళ్లను సందర్శించాను. ఇది ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు చేసిన కుట్ర కావచ్చు. ఇక గోపాల్‌గంజ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, “గత రెండు రోజుల్లో జిల్లాలోని ముహమ్మద్‌పూర్ గ్రామంలో కొంతమంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. శవపరీక్ష నివేదికలు ఇంకా రావాల్సి ఉన్నందున వారి మరణానికి గల కారణాలను నిర్ధారించలేము. మూడు బృందాలు కేసును విచారిస్తున్నాయి. కొన్ని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు దహనం చేశారని స్థానిక పోలీసులు తెలిపారని ఆయన అన్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ముజఫర్ జిల్లాలో.. గత నెల అక్టోబరు 30 న కల్తీ మద్యంతాగిన.. ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.