 
                                                                 New Delhi, Nov 4: దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం (Delhi Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులను ఈ వాయుకాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ గాలి నాణ్యత సూచీ పేలవంగా ఉన్నది. దీపావళి పండుగ నేపథ్యం సూచీ మరింత దిగజారే అవకాశాలున్నాయని (Air Quality on Diwali Day Starts with 'Very Poor' ) సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్నది. పీఎం 2.5, పీఎం 10 కేటగిరీల్లో ఢిల్లీ వాయు నాణ్యత 252, 131గా ఉన్నట్లు వాతావరణ అదికారులు చెప్పారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా (CBCB) ప్రకారం.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 352 నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల వరకు గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. ఐటీలోలో 354, అయానగర్‌లో 315, లోధిరోడ్ 303, మేజర్ ధ్యాన్‌చందన్ నేషన్ స్టేడియం 336, ఐజీఐ విమానాశ్రయం వద్ద 306, చాందినీచౌక్ 341, ద్వారకా సెక్టార్-8లో 340, ఓఖ్లా 359, శ్రీ అరబిందో మార్గ్ 329 గా నమోదైంది. అలాగే ఢిల్లీకి పొరుగున ఉన్న నగరాల్లో సూచీ పూర్ కేటగిరిలో ఉన్నది. అక్టోబర్ 17న పూర్ కేటగిరీలో ఉన్న ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యధిక AQI 298గా నమోదైంది.
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ తీవ్ర కేటగిరిలోకి వచ్చే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్ ఏజెన్సీ సఫర్ తెలిపింది. 5, 6వ తేదీల్లోనూ వాయు నాణ్యత క్షీణించినా… వెరీ పూర్ క్యాటగిరీలోనే ఉంటుందని ఐఎండీ పేర్కొన్నది.వాయు కాలుష్యం స్థానిక వనరుల కారణంగా పెరిగిందని పిటిఐ నివేదించింది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ వాయు కాలుష్యంలో వ్యవసాయ వ్యర్థాలు తక్కువగానే ఉన్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
