Supreme Court. (Photo Credits: Wikimedia Commons

New Delhi, Jan 8: గుజరాత్ అల్లర్లు - 2002 సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబసభ్యులను హతమార్చిన కేసులో (Bilkis Bano Case) సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను ( 11 Convicts Remission is Maintainable) సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.

గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం Supreme Court చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

గర్భవతిని రేప్ చేసిన ఆ 11 మందిని ఎందుకు విడుదల చేశారు, బిలిస్క్‌ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, పూర్తి వివరాలు ముందుంచాలని ఆదేశాలు

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పును వెలువరించింది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి ఉత్తర్వులను జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలోనే జరిగిందని గుర్తుచేసింది.

బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం కేసులో సుప్రీం కీలక నిర్ణయం, పిటిషన్‌ విచారణకు కొత్త బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు అంగీకారం, 21 ఏళ్ల వయసులో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో

కాగా 1992 నాటి చట్టం ఆధారంగా గుజరాత్ ప్రభుత్వం దోషులను విడుదల చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది.ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి, సత్ప్రవర్తన ప్రదర్శించారని అందుకే వారిని రిలీజ్ చేస్తున్నట్లు ప్రత్యేక ప్యానెల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది.

ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మోయిత్రా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం.. " దోషుల మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అటువంటి పరిస్థితిలో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత వారిని ఎలా విడుదల చేశారు.? ఇతర ఖైదీలను ఎందుకు విడుదల చేయలేదు.?" అని ప్రశ్నించింది.