BJP MLA MP Kumaraswamy (Photo-ANI)

Bengaluru, Nov 21: కర్నాటక (Karnataka): చిక్‌మంగళూరు (Chikmagalur)లో ఎమ్మెల్యే కుమారస్వామి (MLA Kumaraswamy)ని గ్రామస్తులు చితక్కొట్టారు. గ్రామస్తులు దాడికి దిగడంతో రక్షించుకునేందుకు ఎమ్మెల్యే రోడ్డుపై పరుగులు పెట్టారు. చిక్‌మంగళూరులో ఓ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువైంది.

ఈ క్రమంలో నిన్న (ఆదివారం) జరిగిన ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే కుమారస్వామిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనుగుల సంచారం గురించి ఎంత మొరపెట్టుకున్నా.. ఎమ్మెల్యే వినలేదని గ్రామస్తులు మండిపడ్డారు.

ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్యం, ప్రసవం సరిగ్గా చేయకపొవడంతో శిశువు మృతి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాధిత కుటుంబ సభ్యులు, జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

మనిషి చనిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు వస్తారా? అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. గ్రామస్తుల బారి నుంచి ఎమ్మెల్యేను రక్షించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గ్రామస్తులను అడ్డుకునే క్రమంలో తోపులాట, ఘర్షణ జరిగింది. కొందరు గ్రామస్తులకు గాయాలయ్యాయి.

Here's Visuals 

గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది