BJP MLA Renukacharya (Photo-ANI)

Bengaluru, Feb 10: తరచూ వివాదాల్లో ఉండే బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మళ్లీ సరికొత్తగా వివాదాన్ని రేకెత్తించారు. మహిళల బట్టలను చూసి పురుషులు ఉద్రేకానికి గురవుతారని ఆయన (BJP MLA Renukacharya) బుధవారం ఢిల్లీలో అన్నారు. మహిళలు బికిని ధరించటం వారి హక్కు అని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ చెప్పడాన్ని ఖండించారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కొన్నిసార్లు మహిళల వస్త్రధారణ పురుషులకు ఉద్రేకాలను (linking rape to women’s clothes) కలిగిస్తుందని ఆయన అన్నారు. ఆయన మాటలపై విమర్శలు రావడంతో తను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు (BJP MLA Renukacharya apologises) చెప్పారు.

స్త్రీలను అవమానించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని తెలిపారు. ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను అవమానించేలా ఉన్నాయని తెలిపారు. ఆమె మహిళలకు క్షమాపణలు చెప్పాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు. కాగా అమ్మాయిలు తమకు నచ్చిన డ్రస్సు వేసుకునే స్వేచ్ఛ ఉందని, ఆ అవకాశం రాజ్యంగం కల్పించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా హోన్నళ్లి ఎమ్మెల్యే రేణుకాచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రియాంక గాంధీ ఓ మహిళ..కాంగ్రెస్ నాయకురాలు.. మహిళల రాజ్యాంగ హక్కులను ప్రశ్నించడం లేదు..కేరళ, బాంబే హైకోర్టులు సైతం స్కూల్స్, కాలేజీల్లో యూనిఫామ్ తప్పనిసరని స్పష్టం చేశాయి.. మా ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది.. విద్యార్థుల విషయంలో బికినీ పదం వినియోగించడం అవమానకరం’’ అని రేణుకాచర్య అన్నారు.

కర్ణాటక హిజాబ్‌పై వివాదం, పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేసిన సింగిల్‌ బెంచ్‌, నిరసనల నేపథ్యంలో విద్యాసంస్థల వద్ద ఆందోళనలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం

ప్రియాంక గాంధీకి భారత సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేదని, ఎందుకంటే ఆమె తల్లి ఇటాలియన్.. ఆమె పెళ్లి కూడా... ఇది ఆమె వ్యక్తిగత విషయం.. ఇలాంటి మాటలు చెప్పడం చాలా అర్థాలకు దారి తీస్తుంది, ఇది సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే.. వీటి వల్ల మన సోదరీమణుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నారు.