Bomb Blast At Tirupati: తిరుపతిలో బాంబు పేలుడు, ఉలిక్కిపడ్డ ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పేలిన బాంబు, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
Bomb Blast At Tirupati (Representational Image)

Tirupati, December 29: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి (Tirupati) బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలుడు (Bomb blast at Tirupati government hospital) జరిగింది. కాగా నాటుబాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు (Dogs)లాక్కెళ్లడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఒక ఆటోలో తీసుకెళ్తున్న బాంబులను కుక్కలు నోటితో పట్టి లాక్కెళ్లినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఈ ఘటన తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణ నష్టం లేకపోవడంతో పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్నబాంబు పేలుడు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

బాంబు పేలిన పరిసరాలను బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేసింది. బాంబుల కోసం గాలిస్తుండగా సమీపంలో నిలిపి ఉంచిన ఆటోలో మరో ఆరు బాంబులను గుర్తించారు. అడవి పందుల కోసం నాటుబాంబులు తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.