BRS Harishrao Condemns the Allu Arjun Arrest(X)

Hyd, Dec 13:  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్ రావు..అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ప్రశ్నించారు.సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం...దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందన్నారు.

అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి...ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?

ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?,ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?,చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు అన్నారు.  అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం 

Here's Tweet:

రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సిఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు?,రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? చెప్పాలన్నారు.