Hyd, Nov 4: 24 గంటల పాటు కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు. ఈ ఘనత తమదేనంటూ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
గతంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండగ అని, మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రైతు వ్యతిరేక వైఖరిని ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డిదని మండిపడ్డారు. ఇప్పుడేమో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓట్ల కోసం కేసీఆర్ సాధించిన ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాధించిన అభివృద్ధిని చూపించుకునే ముఖం లేక, తెలంగాణలో బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిని చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో 2028లో ఎగిరేది బీజేపీ జెండానే, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఇక రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు(Former minister Harish Rao) తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
BRS Tweet
తెలంగాణ గ్రామాలను దేశానికే ఆదర్శంగా నిలిపిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రేవంత్?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటింది కానీ 11 లక్షల బిల్లులు కూడా సర్పంచులకు చెల్లించలేదు.
ముఖ్యమంత్రి లేదా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సర్పంచులను చర్చలకు పిలిచి, వెంటనే వారి పెండింగ్… pic.twitter.com/bTUFwitEqV
— BRS Party (@BRSparty) November 4, 2024
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు.
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ మాజీ సర్పంచ్‌లు ఈరోజు (సోమవారం) పోరుబాటకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించిన మాజీ సర్పంచ్‌లు హైదరాబాద్‌కు వచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న హోటల్‌లో మాజీ సర్పంచ్‌లంతా సమావేశమయ్యారు. అయితే విషయం తెలిసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్‌లను హోటల్ నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకుని బయటకు వచ్చిన పలువురు మాజీ సర్పంచ్‌లను ఖాకీలు అరెస్ట్ చేశారు.