Revanth Reddy vs KTR (photo-FB)

Hyderabad, NOV 07: తన అరెస్ట్ గురించి జరుగుతున్న ప్రచారంపై మాజీమంత్రి కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ఆయన నిప్పులు చెరిగారు. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, జైల్లో పెడితేపెట్టుకోండి అని కేటీఆర్ అన్నారు. తాను జైలుకి వెళ్లేందుకు సిద్ధమన్నారాయన. రెండు మూడు నెలలు తనను జైల్లో పెట్టి  (KTR on Arrest Rumors) పైశాచిక ఆనందం పొందుతాను అంటే.. తనకేమీ అభ్యంతరం లేదన్నారు. మంచిగా జైలుకి వెళ్తానన్నారు. అక్కడ యోగా చేసుకుని, ట్రిమ్ గా బయటకు వచ్చి పాదయాత్రకు వెళ్తాను అని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ రేస్ (Farmula E race) విష‌యంలో మీడియాకు చెప్పిందే.. అక్క‌డ చెబుతా. గ‌వ‌ర్న‌మెంట్‌గా నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెబుతాను. హైద‌రాబాద్, తెలంగాణ అభివృద్ధి దృష్ట్యా నిర్ణ‌యం తీసుకున్నాను.

KTR Reacts on Arrest Rumors

 

నా మీద కేసులు ఎందుకు పెడుతావ్.. హైద‌రాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు తెచ్చినందుకా..? ప్ర‌పంచప‌టంలో హైద‌రాబాద్‌ను నిలబెట్టినందుకా..? బెంగ‌ళూరును దాటి హైద‌రాబాద్‌లో ఐటీ ఎగుమ‌తులు పెంచినందుకా..? పారిపోతాయ‌న్న కంపెనీల‌ను కాపాడినందుకా..? దిగ్గ‌జ కంపెనీల‌కు డ్రీమ్ డెస్టినేష‌న్‌గా మార్చినందుకా..? కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్ర పిల్ల‌ల భ‌విష్య‌త్‌కు బంగారు బాట‌లు వేసినందుకా..? అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ గేమ్‌ల‌తో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు త‌ప్పించుకోలేడు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా.. మేం నిన్ను విడిచిపెట్టం. ఆరు గ్యారెంటీల‌ను వ‌దిలిపెట్టం. అప్పుడప్పుడు నువ్వు గోకిన‌ట్టు చేస్తే మేం కూడా వివ‌ర‌ణ ఇస్తాం ఎందుకంటే ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియాలి. ఇన్ని చెప్పినా కూడా కేసు పెడుతాం అంటే నీ ఇష్ట‌మున్న కేసు పెట్టుకో అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ తేల్చిచెప్పారు.

Bandi Sanjay on 2028 Telangana Elections: తెలంగాణలో 2028లో ఎగిరేది బీజేపీ జెండానే, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు 

కేటీఆర్ టార్గెట్ అని పేప‌ర్ల‌లో రాస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమ‌లు, వ‌డ్ల కొనుగోలు, రైతుబంధు, ద‌ళిత‌బంధు, స్కూటీలు ఇచ్చుడు, తులం బంగారం ఇచ్చుడు, గురుకులాలు బాగు చేసే విష‌యంలో టార్గెట్ ఉండాలి.. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో.. నాకేం ఫ‌రక్ ప‌డేది లేదు. ఓ రెండు, మూడు నెల‌లు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంత‌రం లేదు. మంచిగా పోతా.. యోగా గిగా చేసుకోని ట్రిమ్‌గా వ‌స్తా.. పాద‌యాత్ర ఎక్కుతా. నేను భ‌య‌ప‌డేటోని కాదు. ఈ ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డ‌ను. గాసిస్ప్ ప‌క్కకు పెట్టి.. గ‌వ‌ర్న‌మెంట్ మీద దృష్టి పెట్టాల‌ని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.