Thane, May 29: మహారాష్ట్రలో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. రాజధాని ముంబైలోని థానే నగరం పరిధిలోని ఉల్లాస్‌నగర్‌లో శుక్రవారం అర్దరాత్రి నివాస భవనం స్లాబ్ కూలిపోవడంతో (Building Slab Collapses) ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అర్దరాత్రి భవనం స్లాబ్ ఒక్కసారిగా (Thane Building Slab Collapses) కుప్పకూలిపోయింది.
ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.శిథిలాల తొలగింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెప్పారు.ఇప్పటి వరకు భవనం శిథిలాల నుంచి ఏడు మృతదేహాలు వెలికి తీసినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. ఉల్లాస్‌నగర్‌లోని నెహ్రూచౌక్ వద్ద ఉన్న ఈ భవనం ఐదో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పైకప్పు (Ulhasnagar Building Slab Collapses) కూలిపోయింది.
రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో తెలియలేదని అధికారులు తెలిపారు.
ఇక యూపీలో పెళ్లింట విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని కమలాపూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగిన వివాహ శుక్రవారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఈ క్రమంలో బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడి పెళ్లి మండపంపై పడిందని వరుడు తెలిపాడు.
Here's ANI Update
Sitapur: Four people died and three others injured due to electrocution during a marriage ceremony at a village in Kamalapur area last night.
"Due to strong winds, a pole of the pandal touched a high voltage line running above it, resulting in the incident," the groom said. pic.twitter.com/K9dSBiuuz5
— ANI UP (@ANINewsUP) May 28, 2021
దీంతో షార్ట్ సర్క్యూట్‌తో జరిగి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట నలుగురు మృతి చెందడంతో విషాదం అలుముకుంది. బంధువుల రోధనలు మిన్నంటాయి.