Amaravathi, November 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan)పై ఆదాయానికి మించిన ఆస్తులు (illegal assets case) ఉన్నాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ( The Special CBI court) వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కేసులో ప్రస్తుతం జగన్ బెయిల్ పై ఉన్నారు. ప్రతి శుక్రవారం న్యాయాస్థానానికి హాజరవుతూ వచ్చారు.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్‌ఆర్‌సిపి పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం (Chief minister of Andhra Pradesh) చేశారు. పరిపాలనా వ్యవహారాల్లో (constitutional duties ) తీరిక లేకుండా గడుపుతున్నారు.
ముఖ్యమంత్రి హోదాల్లో వైఎస్ జగన్ (Andhra Pradesh CM Jagan Mohan Reddy) సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సి వస్తే 60 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఖర్చు చేయాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలను విన్న తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చింది.
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో వైఎస్ జగన్ సుమారు ఎనిమిదేళ్ల నుంచీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయన 16 నెలల పాటు హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై బయటకువచ్చారు.
ముఖ్యమంత్రికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలను న్యాయస్థానం ఆలకించింది. తొలుత ఈ పిటీషన్ ను న్యాయస్థానం తోసి పుచ్చింది. ఇదే విషయంపై దాఖలైన మరో పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.