File image of Minister Sabitha Indra Reddy | File Photo.

Hyderabad, January 10:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో జగన్ అక్రమాస్తుల (YS Jagan Disproportionate Assets) కేసులకు సంబంధించి పెన్నా సిమెంట్స్ కేసులో దాఖలైన సప్లిమెంటరీ పిటిషన్ విచారణను సీబీఐ కోర్టు (CBI Court) శుక్రవారం స్వీకరించింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy) కి సమన్లు జారీ అయ్యాయి. వీరితో పాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి మరియు రిటైర్డ్ ఆఫీసర్లు శ్యాముల్, VD రాజ గోపాల్, డిఆర్ఓ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మలకు కూడా సీబీఐ కోర్ట్ సమన్లు ​​జారీ చేసింది. విచారణ కోసం జనవరి 17 న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

గతంలో అనంతపురం జిల్లాలో పెన్నా సిమెంట్స్‌కు భూముల కేటాయింపు మరియు తాండూర్‌ తదితర ప్రాంతాల్లో గనుల కేటాయింపు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. అప్పడు గనులశాఖ మంత్రిగా ఉన్న సబిత ఇంద్రారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సహా మిగతా ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది.

రెండేళ్ల క్రితమే ఈ చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, హైకోర్టు విధించిన స్టే కారణంగా విచారణ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు స్టేను ఎత్తివేయడంతో సీబీఐ తిరిగి ఈ ఫైల్‌ను బయటకు తీసింది. అయితే ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌‌ను విచారణకు స్వీకరించవద్దంటూ జగన్ మరియు ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఇప్పటికే విచారణలు జరిగిన చార్జిషీట్‌ మళ్ళీ తెరిచి కొత్తవారిని నిందితులుగా చేర్చడం సమంజసం కాదని లాయర్లు వాదించారు.

సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్, తెలంగాణలో భారీ బందోబస్తు!

కీలకమైన సాక్ష్యాలను సేకరించినప్పుడల్లా అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసే స్వతంత్రత తమకు ఉందని సీబీఐ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, సీబీఐ అధికారుల వాదనలతో ఏకీభవించి ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.