Andhra pradesh CM Jagan to appear in CBI court in disproportionate assets case (Photo-ANI)

Hyderabad, January 10: అక్రమాస్తుల కేసుల విషయంలో ఏపీ (Andhra pradesh)సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP Cm YS Jagan)నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు (CBI court) వచ్చారు.

ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. కాగా, సీఎం హోదాలో తొలిసారి ఆయన సీబీఐ కోర్టుకు హాజరుకావడం గమనార్హం. చివరిసారిగా గత ఏడాది మార్చి 1న కోర్టుకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కేసులో భాగంగా కొండా మురళి, సురేఖ కూడా కోర్టుకు చేరుకున్నారు.

Here's ANI Tweet

సీఎం హోదాలో తొలిసారిగా సీబీఐ కోర్టుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం జగన్ ఉదయమే విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్వాయ్‌లో సీబీఐ కోర్టుకు వెళ్లారు.

విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

సీఎంతోపాటు కోర్టుకు హాజరైన వారిలో ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, మాజీ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, శ్యామ్యూల్, ఇతర నేతలు కూడా ఉన్నారు. మధ్యాహ్నం వరకూ సీఎం కోర్టులోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద మీడియాను మెయిన్ గేట్ వరకే పరిమితం చేశారు.

అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ

ప్రస్తుతం కోర్టులో సీబీఐకి సంబంధించి 11 ఛార్జిషీట్లు, ఈడీకి చెందిన 5 ఛార్జిషీట్లపై విచారణ జరుగుతోంది. అయితే, నిందితులు కోర్టులో హాజరయ్యాక, విచారణ వాయిదా పడే అవకాశముంది. ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరుకాలేనని, ప్రజాసేవలో బిజీగా ఉంటున్నందున వీలుకాదని గతంలో సీఎం జగన్ విన్నవించుకున్న సంగతి తెలిసిందే.

తన తరఫున న్యాయవాది హాజరవుతారని కోరగా, అందుకు కోర్టు తిరస్కరించింది. జనవరి 10న జగన్ తప్పనిసరిగా కోర్టులో హాజరుకావాల్సిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

,