AP High Court (Photo-Twitter)

New Delhi, Oct 6: పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah), అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులిచ్చింది. వీరితో కలిపి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తుల బదిలీకి (Transfer of 15 High Court Judges) రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గత నెల 16న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మామిడన్న సత్యరత్న శ్రీ రామచంద్రరావును పంజాబ్, హరియాణాల హైకోర్టుకు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

పంజాబ్ అండ్ హ‌ర్యానా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్‌ జ‌స్వంత్ సింగ్‌ను ఒడిశాకు బ‌దిలీ చేసింది. రాజ‌స్థాన్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌బీనాను హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఒడిశా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్‌ సంజ‌య కుమార్ మిశ్రా.. ఉత్త‌రాఖండ్‌కు బ‌దిలీ అయ్యారు. జ‌స్టిస్ ఎంఎం శ్రీవాత్స‌వ ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు నుంచి రాజ‌స్థాన్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. గుజ‌రాత్ నుంచి ప‌రేశ్ ఆర్ ఉపాధ్యాయ‌ను మ‌ద్రాస్ హైకోర్టుకు, క‌ల‌క‌త్తా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరిందం సిన్హాను ఒడిశాకు, కేర‌ళ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏఎం బాద‌ర్‌ను పాట్నాకు బ‌దిలీ చేశారు.

ఈ సారి ఎల్‌పీజీ సిలిండ‌ర్‌ ధర రూ.15 పెంపు, పెరిగిన ధ‌ర‌తో 14.2 కేజీల నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ధర రూ.899, కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు

అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌ను ఢిల్లీ హైకోర్టుకు, అల‌హాబాద్ హైకోర్టు నుంచి వివేక్ అగ‌ర్వాల్‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు, జ‌స్టిస్‌ చంద్ర‌ధారి సింగ్‌ను అల‌హాబాద్ నుంచి ఢిల్లీకి బ‌దిలీ చేశారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి జ‌స్టిస్ అనూప్ చిత్కారాను పంజాబ్ అండ్ హ‌ర్యానా హైకోర్టుకు బ‌దిలీ చేశారు. ఇక అల‌హాబాద్ హైకోర్టులో ప‌ని చేస్తున్న ర‌వినాథ్ తిల్హ‌రిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.