File image of Maoists used for representational purpose | (Photo Credits: PTI)

Raipur, Jan 11: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయినట్టు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Maoist Leader Madvi Hidma) హతమయినట్లుగా వార్తలు వస్తున్నాయి.తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. బుధవారం ఉదయం బీజాపూర్‌ అడవుల్లో సీఆర్‌పీఎఫ్‌ దళాలు కూబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్‌కౌంటర్‌ (Greyhounds Encounter) జరిగింది.

ఇదిలా ఉంటే, మావోయిస్టు కేంద్ర కమిటీ.. హిడ్మా మృతిని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. 43 ఏళ్ల వయసు గల హిడ్మా..దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చినట్లుగా వార్తలు వచ్చాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు.7వ తరగతి వరకు చదుకున్నప్పటికీ మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో కీలక నేతగా కీలక నేతగా ఎదిగాడు. హిడ్మా ఇంగ్లిష్‌ మాత్రం చక్కగా మాట్లాడగలడని 2015లో ఫిబ్రవరిలో అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి పేర్కొన్నాడు.

తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి, ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి హిడ్మా కమాండర్‌గా ఉన్నారు. ఈ దళంలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్‌ ఆయుధాలను వినియోగిస్తారు. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను ఈ బెటాలియన్‌ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని పేరు. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోల వైపు 10శాతం కంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరుంది.

అందుకే గతంలో సుక్మా సమీపంలో జరిగిన దాడుల్లో భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. అందుకే అతడు అత్యంత వేగంగా మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకొన్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి హిడ్మా.

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా, తదుపరి షెడ్యూల్‌ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపిన బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కాగా మృతి చెందిన మావోయిస్టులను నిర్ధారించే పనిలో పోలీసులు ఉన్నారు. కూంబింగ్‌ కోసం పోలీసులు హెలికాప్టర్‌ను కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ వార్తలపై బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ స్పందించారు. భద్రతాదళాల సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. సవివరమైన సమాచారం త్వరలో తెలియజేస్తామని ప్రకటించారు.

అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్‌ జవాన్లను టార్గెట్‌ చేయడంలో హిడ్మా వ్యూహాలు చాలా సార్లు సక్సెస్‌ కావడంతో.. హిట్‌ లిస్టులో ఉన్నాడు. ఉర్పల్‌ మెట్లలో 2007లో జరిగిన 24మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది జవాన్లు, 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి పార్టీ, రెండోది సాయుధ బలగం, మూడు ప్రజా ప్రభుత్వం. మూడు విభాగాల్లోనూ పని చేసిన హిడ్మాపై 45 లక్షల రూపాయల రివార్డు ఇప్పటికే ఉంది.