Patna, Nov 13: బీహార్‌లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాదాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నమస్కరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నితీశ్ కుమార్... మోదీ వైపు నడుస్తూ అతని పాదాలను తాకే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. అయితే ఇది గుర్తించిన ప్రధాని వెంటనే తన కాళ్లని వెనక్కి తీసుకున్నారు. అతనితో కరచాలనం చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు,ఓటేసిన ప్రముఖులు..తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
ఇదే కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు ప్రధాని మోదీకి పూలమాల వేస్తుండగా... ఆయన నితీశ్ కుమార్‌ను తన వైపుకు లాక్కోవడం జరిగింది. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ పాదాలకు నితీశ్ కుమార్ నమస్కరించేందుకు ప్రయత్నించడం ఈ ఏడాది ఇది మూడోసారి. జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రధానిని కలిసిన సందర్భంలో మోదీ పాదాలను తాకే ప్రయత్నం చేశారు. అంతకుముందు, లోక్ సభ ఎన్నికల సమయంలో నవదాలో నిర్వహించిన సభలో మోదీ పాదాలను తాకారు.
Nitish Kumar Tries to Touch PM Modi's Feet:
🚨 BIG! Bihar CM Nitish Kumar once again tries to touch PM Modi's feet 💖
– Modi ❤️ Nitish bond is getting stronger & stronger...! pic.twitter.com/dhrxqm3Ecz
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 13, 2024
Nitish Kumar को जब मंच पर हाथ पकड़ PM Modi ने खींच लिया, ऐसी बॉन्डिंग देखी क्या ? pic.twitter.com/BB7ct9a5eX
— Bihar Tak (@BiharTakChannel) November 13, 2024
కాగా, దర్భంగాలో ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని, సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్‌పై నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను బయటకు తీసుకువచ్చారని ప్రశంసించారు.