Controversy on Telangana Govt Digital crop survey(video grab)

Hyd, Oct 20: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(AEO).శామీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈవోలు.

ప్రభుత్వం చేపట్టమన్న డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టలేమని తేల్చిచెప్పారు. ఉద్యోగం లో చేరి 7 సంవత్సరాలు పూర్తి అయింది...గత 7 సంవత్సరాలలో అనేక వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత 7 సంవత్సరాల కాలంలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు.  పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి 

Here's Video:

విజయవంతంగా రైతు బంధు, రైతు భీమా అమలు చేశామని.. రైతు వేధికలు నిర్మించామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వేకు మేము వ్యతిరేకం కాదు కాని మేమే వెళ్లి చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది...మేము చాలా మంది అడవాళ్ళం ఉన్నాం అన్నారు.మాకు భద్రత ఎక్కడ ఇస్తారు... ప్రభుత్వం చాలా సులువుగా చెప్తుంది కానీ చేయడం అంత ఈజీ కాదు అన్నారు.