COVID-19 Outbreak in India. | PTI Photo

New Delhi, April 2:  భారతదేశంలో మొత్తం కరోనావైరస్ ( COVID-19 in India) పాజిటివ్ కేసులు గురువారం ఉదయం నాటికి 1,965 కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. గత 12 గంటల్లో 131 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటివరకు కరోనా సోకి 50 మంది మరణించగా, ప్రస్తుతం 1764 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మరో 151 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.

మహారాష్ట్రలో (Maharashtra)  కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది, రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 338కి చేరగా, మరణించిన వారి సంఖ్య 17కు పెరిగింది. మహారాష్ట్రలో తాజాగా ఒక పోలీస్ ఆఫీసర్ కు కరోనా సోకింది, అలాగే ఒక 26 ఏళ్ల మహిళకు మరియు ఆమె 7ఏళ్ల కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ముంబైలోని ధారావి ప్రాంతంలో ఓ 53 ఏళ్ల వ్యక్తి కరోనావైరస్ సోకి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇక్కడ ఇళ్లు ఒకదానికొకటి అతుక్కొని తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివసిస్తారు. దీంతో మహారాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. చనిపోయిన వ్యక్తి ఇంటిని పూర్తిగా సీజ్ చేసింది.

Here's the update on COVID-19 status:

మహారాష్ట్ర తర్వాత కేరళలో అత్యధికంగా 267 పాజిటివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడు 235, దిల్లీలో 154, ఆంధ్రప్రదేశ్ లో 132, తెలంగాణలో 127, ఉత్తర ప్రదేశ్ లో 115, కర్ణాటకలో 113, రాజస్థాన్ 108, మధ్య ప్రదేశ్ లో 105 కేసులు నమోదయ్యాయి.

దేశంలో సిక్కిం రాష్ట్రం మినహా మిగతా 27 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనావైరస్ ప్రభావం కనిపిస్తుంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రస్తుతం దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనావైరస్ వయా మర్కజ్, ఆంధ్రప్రదేశ్‌లో 132, తెలంగాణలో 127 కేసులు నమోదు

రాష్ట్రాలలో  లాక్ డౌన్ అమలు, కరోనావైరస్ నియంత్రణ చర్యలపై ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.