Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, June 13:  భారతదేశంలో కోవిడ్ ఉదృతి అంతకంతకూ పెరుగుతూనే పోతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 11,458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 3,08,993 కు చేరింది. నిన్న ఒక్కరోజే 386 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 8,884 కు పెరిగింది.

నిన్న దేశవ్యాప్తంగా అత్యధికంగా 7,135 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,54,330 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,45,779 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రాల వారీగా ప్రస్తుతం ఉన్న ఆక్టివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

S. No. Name of State / UT Active Cases* Cured/Discharged/Migrated* Deaths** Total Confirmed cases*
1 Andaman and Nicobar Islands 5 33 0 38
2 Andhra Pradesh 2495 3105 80 5680
3 Arunachal Pradesh 63 4 0 67
4 Assam 1953 1537 8 3498
5 Bihar 2480 3587 36 6103
6 Chandigarh 43 286 5 334
7 Chhattisgarh 873 550 6 1429
8 Dadra and Nagar Haveli and Daman and Diu 28 2 0 30
9 Delhi 22212 13398 1214 36824
10 Goa 394 69 0 463
11 Gujarat 5619 15493 1415 22527
12 Haryana 3789 2475 70 6334
13 Himachal Pradesh 183 297 6 486
14 Jammu and Kashmir 2591 2086 53 4730
15 Jharkhand 937 672 8 1617
16 Karnataka 2997 3440 79 6516
17 Kerala 1303 1000 19 2322
18 Ladakh 176 62 1 239
19 Madhya Pradesh 2802 7201 440 10443
20 Maharashtra 49628 47796 3717 101141
21 Manipur 308 77 0 385
22 Meghalaya 21 22 1 44
23 Mizoram 103 1 0 104
24 Nagaland 107 49 0 156
25 Odisha 1014 2474 10 3498
26 Puducherry 88 67 2 157
27 Punjab 641 2282 63 2986
28 Rajasthan 2898 8898 272 12068
29 Sikkim 61 2 0 63
30 Tamil Nadu 18284 22047 367 40698
31 Telangana 2032 2278 174 4484
32 Tripura 682 278 1 961
33 Uttarakhand 756 947 21 1724
34 Uttar Pradesh 4642 7609 365 12616
35 West Bengal 5587 4206 451 10244
Cases being reassigned to states 7984 7984
Total# 145779 154330 8884 308993

 

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఒక ఎత్తైతే, మహారాష్ట్రలో నమోదయ్యే కేసులు మరో ఎత్తు అన్నట్లుగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు నమోదవుతున్న పాజిటివ్ కేసులతో కరోనావైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలోని వుహాన్ నగరాన్ని సైతం మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం దాటేసింది.

మహారాష్ట్రలో COVID-19 కేసులు లక్ష మార్కును దాటాయి. ఇప్పటివరకు 1,01,141 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,717 కు చేరుకుంది. ఒక్క ముంబై నగరంలోనే 55,451 మంది కోవిడ్ బాధితులున్నారు. కరోనావైరస్ కారణంగా ముంబైలో ఇప్పటివరకు 2,044 మంది ప్రాణాలు కోల్పోయారు.