Cyclone in Gujarat. (Photo Credits: Twitter Video Grab)

Gandhi Nagar, June 13: అత్యంత తీవ్రంగా మారిన బిపర్‌జోయ్‌ తుపాను గుజ‌రాత్ తీరం దిశ‌గా వెళ్తోంది.ఈ నెల 15న గుజరాత్‌లోని జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. దీంతో ద్వార‌క‌లో బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మార‌డంతో పెద్ద ఎత్తున్న‌ అల‌లు ఎగిసిప‌డుతున్నాయి.

పోరుబంద‌ర్‌తో పాటు ద్వార‌క జిల్లాల్లో గాలి వేగం పుంజుకుంటున్న‌ట్లు ఐఎండీ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. ఆ జిల్లాల్లో గాలి వేగం గంట‌కు 75 కిలోమీట‌ర్లు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గుజ‌రాత్‌లోని క‌చ్ ప్రాంతంతో పాటు పాకిస్థాన్‌లోని క‌రాచీ తీర ప్రాంతం మ‌ధ్య బిప‌ర్‌జాయ్ తుఫాన్ గురువారం తీరం దాటే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అరేబియా సముద్ర తీర ప్రాంత జిల్లాలైన కచ్, పోరుబందర్, ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బిల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. తీరం వెంట ఉన్న సుమారు 8 వేల మందిని ఇప్ప‌టికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మరో 5 రోజులు మండిపోనున్న ఎండలు, రుతుపవనాలు వచ్చినా భానుడు సెగలు తప్పవని ఐఎండీ హెచ్చరిక

క‌చ్‌, జామ్‌న‌గ‌ర్‌, మోర్బీ, గిర్ సోమ‌నాథ్‌, పోరుబంద‌ర్‌, ద్వారక జిల్లాల్లో తుఫాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ది. ఆ జిల్లాల్లో భారీ వ‌ర్ష సూచ‌న ఉంది. గాలి వేగం కూడా శ‌క్తివంతంగా మారే ఛాన్సు ఉన్న‌ట్లు తెలిపారు. జూన్ 15వ తేదీన‌ దాదాపు 150 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ తెలిపింది. ఆ ఈదురుగాలుల వ‌ల్ల న‌ష్టం భారీ స్థాయిలో ఉండే ఛాన్సు ఉంద‌ని ఐఎండీ డైరెక్ట‌ర్ తెలిపారు.

బిప‌ర్‌జాయ్ అన్న ప‌దాన్ని బంగ్లాదేశ్ పెట్టింది. బిప‌ర్‌జాయ్ అంటే బెంగాలీ భాష‌లో విప‌త్తు అని అర్థం. ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ (డ‌బ్ల్యూఎంవో) నుంచి ఆ పేరును తీసుకున్నారు. ప్ర‌స్తుతం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మాండ‌వీయ .. గుజ‌రాత్‌లో డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ ప‌రిస్థితిని స‌మీక్షించారు. తుఫాన్ వ‌ల్ల న‌ష్టాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నంపై మంత్రులు దృష్టిపెట్టారు.

దక్షిణాది రాష్ట్రాలకు తప్పిన బిపర్‌జోయ్‌ ముప్పు, నార్త్ ఇండియాను వణికిస్తున్న తీవ్ర తుపాను, జూన్‌ 15వ తేదీన గుజరాత్‌ తీరాన్ని తాకనున్న సైక్లోన్

ఈ నెల 15, 16 తేదీల్లో సౌరాష్ట్ర–కచ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఎగురవేయడంతోపాటు 16వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.గుజరాత్‌లో పాఠశాలలకు ఈనెల 15 వరకు సెలవులు ప్రకటించారు. సుమారు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కచ్‌–సౌరాష్ట్ర జిల్లాల్లో తీరానికి 10 కిలోమీటర్లలోపు దూరంలోని గ్రామాల వారిని మంగళవారం నుంచి తరలిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉండే సుమారు 10 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలో ఉంచుతామని కచ్‌ కలెక్టర్‌ అమిత్‌ అరోరా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 12 బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘తుపాను ప్రభావంతో విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అత్యవసర సౌకర్యాలకు ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే పునరుద్ధరించాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది.

ఇందుకు గాను కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారని తెలిపింది. తపానుతో ఉత్పన్నమైన పరిస్థితులను తెలుసుకునేందుకు హోం శాఖ రాష్ట్ర యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉంటుందని పీఎంవో వివరించింది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్‌ షా, ఐఎండీ డీజీ మృత్యుంజయ్‌ తదితరులు హాజరయ్యారు.