Vjy, Oct 21: తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారుతుందని, అక్టోబరు 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇది తుపానుగా మారితే దీని దన అని పేరు పెట్టనున్నారు.
ఇది పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వైపు కదులుతోందన్నారు. ఈ అల్పపీడనం ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపాన్‌గా ఏర్పడిన తర్వాత ఈ నెల 24,25 తేదీల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రభావం చూపుతుందన్నారు. కాబట్టి ఒడిశా వైపు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
Cyclone Dana Live Tracker Map
దీని ప్రభావంతో అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని... అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, సముద్రంలో ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఏపీఎస్డీఎంఏ స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
దానా తుపాను అక్టోబర్ 24న తీరం దాటే అవకాశం ఉన్నందున రానున్న వారంలో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఒడిశా తీరప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ రాయ్ ఏఎన్‌ఐతో చెప్పారు. ఈరోజు మరియు రేపు A&N దీవులలో మరియు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు కోస్టల్ ఒడిశాలో అక్టోబర్ 23న భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేయబడింది. గంగానది పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీరప్రాంతాలలో అక్టోబర్ 24 మరియు 25 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అస్సాంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. , త్రిపుర, మిజోరాం మరియు మేఘాలయలో అక్టోబర్ 23-25 వరకు, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33-34 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 18-20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.
ఇక తెలంగాణ రాష్ర్టంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.