Hyd, Oct 24: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడింది దానా. వాయవ్య బంగాళాఖాతంలోకి ఏర్పడగా ఒడిశా, బెంగాల్ తీరాలకు అలర్ట్ జారీ చేశారు. 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోంది దానా. పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో.. సాగర్ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.
రాత్రి పూరి-సాగర్ ఐలాండ్ దగ్గర తీరందాటనుంది దానా తుపాన్. తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనుండగా ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్ తీరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
దానా తుపాను కారణంగా 200 రైళ్లు రద్దయ్యాయి. విమానాలను సైతం నిలిపివేశారు అధికారులు. ఒడిశా, బెంగాల్‌లోని అనేక తీరప్రాంత జిల్లాల నుండి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే 1.14 లక్షల మందికి పైగా ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను పరిస్థితులను సమీక్షించారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ. డేంజర్ జోన్ లో నివసిస్తున్న 3-4 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. దీపావళి ముందే పొలిటికల్ బాంబ్...ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో కీలక నేతలపై చర్యలు, సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పొంగులేటి
శుక్రవారం ఉదయం నాటికి ఒడిశాలోని భితార్కానికా నేషనల్ పార్క్ మరియు ధామ్రా పోర్ట్ మధ్య గాలి వేగం 120 కిమీ (75 mph) వరకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 'దానా' తుఫాను కారణంగా కోల్‌కతా సహా దక్షిణ పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాను కారణంగా అక్టోబర్ 24 మరియు 25 తేదీల్లో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు.