Minister Ponguleti Srinivas sensational comments, Political bombs explode soo(X)

Hyd, Oct 24: దక్షిణకొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అని తెలిపారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయిన్నారు. కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు ఉంటాయని తెలిపారు పొంగులేటి. ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు.

రిపోర్టులు త్వరలోనే వస్తాయని...తప్పు చేసినవారు ఎంతటివారైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. దక్షిణ కొరియా నుంచి తాము వచ్చేలోగానే నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసింది కేటీఆర్, హరీశ్‌ రావు. ఖచ్చితంగా వీరిద్దరి అరెస్ట్‌లు ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరి పొంగులేటి చెప్పిన ఆ దీపావళి పొలిటికల్ బాంబులు ఎంత పనిచేస్తాయో వేచిచూడాలి.  బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక

Here's Tweet:

ధరణి పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భూముల్ని దర్జాగా దోచుకున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ . ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి రైతులపాలిట శాపంగా మారిందని...ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్, హరీశ్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారు అన్నారు.