MP Mohan Delkar (Photo Credits: Facebook)

Mumbai, Feb 22: దాద్రా అండ్ నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ముంబై హోటల్ గదిలో శవమై (MP Mohan Delkar Death) కనిపించడం సంచలనం సృష్టించింది. ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న సీ గ్రీన్ సౌత్ హోటల్ గదిలో ఆయన (Dadra and Nagar Haveli MP Mohan Delkar ) విగతజీవుడిగా పడి వుండడాన్ని గుర్తించారు.

ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ గదిలో గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది.

సిల్వస్సా ప్రాంతంలో ఓ వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించిన మోహన్ దేల్కర్ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించారు. మోహన్ దేల్కర్ ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ ను వీడారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆయన ఏడు సార్లు ఎంపీగా గెలుపొందారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలే లక్ష్యంగా సెక్స్ రాకెట్, ముగ్గురి వ్యక్తులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, 58 బ్యాంకు ఖాతాలు స్వాధీనం, 171 నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్, 4 టెలిగ్రామ్ ఛానెళ్లతో ఎర

ANI Tweet

ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. గతేడాది దాద్రా నగర్ హవేలిలో స్థానిక ఎన్నికల కోసం జేడీయూతో పొత్తు పెట్టుకున్నారు. 58 ఏళ్ల మోహన్ దేల్కర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలన తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇతరాత్రా కారణాల రీత్యా సూసైడ్ చేసుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.