Zeeshan Siddique, Salman Khan (Photo Credits: Facebook)

Mumbai, Oct 29: మ‌హారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ (Baba Siddique) హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) నేత జీష‌న్ సిద్ధిక్‌ (Zeeshan Siddique)కి, బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan)లను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన విషయం విదితమే.

ఈ బెదిరింపు కాల్స్ అక్టోబ‌ర్ 25వ తేదీన వ‌చ్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ బెదిరింపులపై జీష‌న్ సిద్ధిక్‌ కార్యాల‌య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్‌ తయ్యబ్‌గా గుర్తించారు. తాజాగా అతడిని అరెస్ట్‌ చేశారు.

వ‌క్ఫ్ బిల్లుపై టీఎంసీ, బీజేపీ ఎంపీల మ‌ధ్య వాగ్వాదం, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ చేతికి తీవ్ర గాయాలు

ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ స‌ల్మాన్ ఖాన్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌కు అక్టోబ‌ర్ 17 రాత్రి మెసేజ్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్‌ ఎవరిది, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. ఈ కేసులో జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల అమ్మకందారుడు షేక్‌ హుస్సేన్‌ షేక్‌ మౌసిన్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Here's Video

జీష‌న్ సిద్ధిక్(Zeeshan Siddique).. అజిత్ ప‌వార్‌కు చెందిన నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీలో ఇటీవ‌లే చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆగ‌స్టులో జీష‌న్‌ను వెలివేసింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ నేప‌థ్యంలో ఆ చ‌ర్య తీసుకున్నది. ఇక త్వర‌లో జ‌ర‌గ‌బోయే మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బాంద్రా ఈస్ట్ నుంచి జీష‌న్ ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేయ‌నున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఆ స్థానం నుంచి మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే మేనేల్లుడు వ‌రుణ్‌పై పోటీ చేసి గెలిచారు.