New Delhi, June 4: రక్షణ శాఖలో కోవిడ్ 19 కలకలం రేగింది. భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు (Defence secretary Ajay Kumar) కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. అజయ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారని అధికారులు తెలిపారు. రక్షణ శాఖ కార్యదర్శికి కోవిడ్ నిర్ధారణ కావడంతో రైసినా హిల్స్ సౌత్ బ్లాక్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) ప్రధాన కార్యాలయంలో కొంత భాగాన్ని సీజ్ చేశారని తెలుస్తోంది. అందులో పని చేస్తున్న 35 మంది అధికారులను హోం క్వారంటైన్లో ఉచ్చారని సమాచారం. ఆరు వేలు దాటిన మృతుల సంఖ్య, దేశంలో కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 2,16,919కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు
కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షలో కోవిడ్ (Coronavirus) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయనను క్వారంటైన్ చేసిన అధికారులు మొత్తం కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు. ఆయన పనిచేస్తున్న రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్‌లోని మిగతా 35 మంది ఉద్యోగులను కూడా హోం క్వారంటైన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) బుధవారం కార్యాలయానికి హాజరు కాలేదు. ఇండియా పేరు మార్చలేం, ఇండియా పేరును భారత్‌గా మార్చాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత ధర్మాసనం
గత కొన్ని రోజులుగా అజయ్ కుమార్.. రక్షణ శాఖ అధికారులు ఎవరెవరిని కలిశారనన్న దానిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర రక్షణమంత్రి, కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. దీంతో మొత్తం కార్యాలయాలను శుభ్రం చేయించి ఉద్యోగులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ కుమార్.. కరోనాపై పోరాటంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైరస్ కట్టడి కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి జూన్ 1 వరకు ఆయన సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు చేశారు.
లాక్‌డౌన్ 4.0లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పక్షం రోజుల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ప్రపంచంలోనే కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో ప్రస్తుతం మన దేశం 7వ స్థానంలో ఉంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో అతి త్వరలోనే భారత్ అమెరికా సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు