Delhi Excise Policy 2021-22: లిక్కర్ స్కాం ప్రకంపనలు, అసలు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంటే ఏమిటీ, బీజేపీ ఎందుకు దీనిపై ఇంతలా మాటల యుద్దం చేస్తోంది, ఢిల్లీ లిక్కర్ పాలసీపై ప్రత్యేక కథనం
Chhattisgarh launches portal for home delivery of liquor to avoid crowding during lockdown (Photo-ANI)

New Delhi, August 23: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Excise Policy 2021-22) కుంభకోణం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఈ ప్రకంపనలు తెలంగాణకు పాకాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈ కుంభకోణంతో సంబంధాలున్నాయన్న బీజేపీ ఎంపీలు చేస్తున్న ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇక ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ సోదాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం మొదలైంది. మేము సీబీఐని స్వాగతిస్తాము. నిజం బయటకు వచ్చే వరకు దర్యాప్తుకు సహకరిస్తాము. మంచి పని చేసే వారిని ఇలా వేధించడం విచారకరం. అందుకే మన దేశం ఇంకా నెం.1గా మారలేదు’’ అని సిసోడియా ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఎక్సైజ్ శాఖకు మనీష్ సిసోడియా నేతృత్వం వహిస్తున్నారు. 2021-22 సంవత్సరానికి మద్యం లైసెన్స్‌దారులకు టెండర్ ప్రక్రియకు అనుచిత ప్రయోజనాలను అందించిన ఉద్దేశపూర్వక మరియు స్థూల విధానపరమైన లోపాలకు సంబంధించి అతను ఇప్పుడు ఈ కేసులో భాగమయ్యాడు. అసలు ఢిల్లీ కొత్త మద్యం విధానం.. ఏంటీ? (What is Delhi excise policy ) అని పరిశీలిస్తే అనేక ఆసక్తిర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

బీజేపీలో చేరితే కేసులన్నీ క్లోజ్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు మెసేజ్, కావాలంటే త‌న తల న‌రుక్కుంటాను కానీ, అవినీతి నేత‌ల‌కు లొంగిపోన‌ంటూ ట్వీట్ చేసిన సిసోడియా

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఏమిటి మరియు అది ఎందుకు వివాదాస్పదంగా మారింది?

1. ఎక్సైజ్ పాలసీ అంటే దేశ రాజధానిలో రిటైల్ మద్యం వ్యాపారం నుండి ఢిల్లీ ప్రభుత్వం నిష్క్రమించడం. కొత్త విధానం ప్రకారం ఢిల్లీలోని 32 జోన్లలో 849 మద్యం దుకాణాలు తెరవాల్సి ఉంది.

2. ఒక్కో మండలంలో 27 మద్యం దుకాణాలు ఉండేలా 8-10 వార్డులుగా విభజించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ నిబంధనలు, నిబంధనలకు లోబడి మాల్స్, వాణిజ్య ప్రాంతాలు, స్థానిక షాపింగ్ కాంప్లెక్స్‌లు మొదలైన వాటిలో మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించింది.

3. అనిల్ బైజాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నప్పుడు గతేడాది నవంబర్ 17న ఎక్సైజ్ పాలసీని అమలు చేశారు.

4. పాలసీ అమలుకు రెండు రోజుల ముందు నవంబర్ 15న అనధికార ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవడంపై బైజాల్ తన వైఖరిని మార్చుకున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. 'అనధికార' ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవాలన్న ప్రతిపాదనపై అప్పటి ఎల్‌జీ అభ్యంతరం చెప్పలేదని, అయితే ఆ వెండ్‌లను తెరవడానికి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ), మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాలని షరతు విధించిందని సిసోడియా ఆరోపించారు. .

5. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా, కేజ్రీవాల్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ, 2021-22, నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. GNCTD చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (ToBR)-1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం-2009 మరియు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్-2010 యొక్క ప్రాథమిక ఉల్లంఘనలను చూపుతూ జూలైలో దాఖలు చేసిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదికపై CBI విచారణకు సిఫార్సు చేసినట్లు వారు తెలిపారు.

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో కొత్త ట్విస్ట్, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులపై వేటు వేసిన కేంద్రం

దేశ 2021 ముందు వరకు రాజధానిలో మద్యం అమ్మే దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే 2021 జూన్‌లో లిక్కర్ షాపుల ప్రైవేటీకరణకు కేజ్రీవాల్ సర్కార్‌ తెర లేపింది. మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి.. ఒక్కో జోన్‌లో 27 లిక్కర్ వెండ్స్ ఉండేలా కొత్త నిబంధనలు ( New liquor policy in Delhi 2022) రూపొందించింది. దీనిద్వారా ఖజానాకు రూ.9,500 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆప్ ప్రభుత్వం.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పంపిన నివేదికలో పేర్కొంది. అప్పట్లో ఢిల్లీ ఎల్‌జీగా ఉన్న అనిల్ బైజల్‌.. నూతన ఎక్సైజ్ పాలసీని ఆమోదిస్తూనే రెండు నిబంధనలు పెట్టారు. ప్రస్తుతం ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో వాటి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వొచ్చు. అయితే దుకాణాలు లేనిచోట మాత్రం.. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి.

లిక్కర్‌ స్కాం కేసుపై సీబీఐ విచారణ, కాషాయపు నేతలపై పరువునష్టం దావా వేసిన ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేతల అరెస్టులపై మండిపడిన కిషన్ రెడ్డి, మీరు మిగులుతారా అంటూ తలసాని మాస్ వార్నింగ్

అయితే డీడీఏ, ఎమ్‌సీడీల నుంచి పర్మిషన్‌ తప్పనిసరి నిబంధనను కేజ్రీవాల్ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఎమ్‌ఆర్‌పీలతో సంబంధం లేకుండా ఇష్టారీతిన ధరలు నిర్ణయించుకునేందుకు లైసెన్స్‌దారులకు అధికారం ఇవ్వడం, తెల్లవారుజామున 3 గంటల వరకూ షాపులు నడుపుకునేందుకు అనుమతితో పాటు డ్రై డేలను 21రోజుల నుంచి 3 రోజులకు తగ్గించడం వంటివి చేసింది. 2021 నవంబర్‌లో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది.

అయితే దీంట్లో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్యం షాపుల కోసం టెండర్లు వేసినవారికి లైసెన్స్ ఫీజ్‌లో రాయితీలు ఇచ్చినట్టు, కొందరికి పూర్తిగా లైసెన్స్ ఫీజ్ మాఫీ చేసినట్టు చీఫ్ సెక్రటరీ తన నివేదికలో పేర్కొన్నారు. ఇక కరోనా టైమ్‌లో మద్యం అమ్మకాలు లేకపోవడంతో రూ.144 కోట్ల ఫీజును కేజ్రీవాల్ ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో పాటు విదేశీ బీరు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా కంపెనీలకు ఒక్కో కేసుకు 50 చొప్పున రాయితీ కూడా ఇచ్చినట్టు సీఎస్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగానే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.

తెలంగాణలో లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు, కల్వకుంట్ల కవితే ప్రధాన సూత్రధారి అంటూ బీజేపీ ఆరోపణలు, నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కేసీఆర్‌ కూతురు, బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఏమన్నారంటే..

ఢిల్లీ విద్యాశాఖతోపాటు ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఆయనతోపాటు అప్పటి ఎక్సైజ్ కమిషనర్‌ ఆరవ గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఏకే తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్‌లతోపాటు మరో 9 మంది వ్యాపారవేత్తలని నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఐపీసీ సెక్షన్ 120-బి, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

మద్యం విధానంలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఎక్సైజ్ అధికారులు, రాజకీయనేతలకు కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు పేర్కొంది. సిసోడియాకు కుడిభుజమైన దినేశ్ అరోరా అనే వ్యక్తికి చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు కోటి రూపాయలు ముడుపులు అందినట్టు సీబీఐ సాక్ష్యాలతో బయటపెట్టింది. అయితే కేజ్రీవాల్‌, సిసోడియా మాత్రం ఇవన్నీ అసత్యాలే అంటున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.