COVID 19 Outbreak in India | PTI Photo

New Delhi, May 7:  దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోగులందరికీ సరిపడా వైద్య సదుపాయాలు లేక, ఆక్సిజన్ చాలా మంది చనిపోతున్న్నారు. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో ఆంక్షలు విధిస్తున్నాయి.

ఇదే క్రమంలో, కేసులు విపరీతంగా పెరుగుతున్న దేశ రాజధాని దిల్లీలో అక్కడి ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చేవారు కచ్చితంగా 14 రోజుల పాటు తమ సంస్థాగత క్వారైంటైన్ కేంద్రాలకు వెళ్లాలని దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారు , ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా 7 రోజుల పాటు హోం ఐసోలేషన్లోనే ఉండాలని స్పష్టం చేసింది.

ఎయిర్ లైన్స్, రైళ్లు, రోడ్డు మార్గాలు మరే ఇతర మార్గాల్లో దిల్లీ వచ్చినా కూడా కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దిల్లీ తాజా నిబంధనలతో విమానయాన సంస్థలు ముందుగానే ప్రయాణికులకు అలర్ట్స్ పంపుతున్నాయి. 14 రోజుల క్వారైంటైన్ నిబంధనలకు ఒప్పుకుంటేనే టికెట్ కొనేందుకు అనుమతిస్తున్నాయి.

Here's the update:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కరోనా వైరస్ యొక్క కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.

దిల్లీలో ప్రతిరోజూ సుమారు 20 వేల కేసులు నమోదవుతుండగా, రోజుకు కనీసం 300 పైగా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నిన్న సుమారు 22 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంగా సుమారు 6 వేల చొప్పున కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.