Delhi Rains: ఓ వైపు కరోనా..మరోవైపు భారీ వర్షాలు, 46 ఏళ్ళ తర్వాత దేశ రాజధానిలో అత్యధిక వర్షపాతం, నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Representational Image | (Photo Credits: PTI)

New Delhi, Sep 11: ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాని (Delhi Rains) కి రహదారులన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 46 ఏళ్ల రికార్డు (This Monsoon Season Highest in 46 Years) బద్దలయింది. 46 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) లో శనివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది.ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఆదివారం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీవర్షం కురిసింది.శనివారం నాడు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దేశాన్ని క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌ ముంచెత్తబోతోంది, ముప్పును ఎదుర్కునేందుకు రెడీ కావాలి, ఉన్న‌తాధికారుల‌తో ప్రధాని మోదీ సమీక్ష, దేశంలో తాజాగా 33,376 మందికి కరోనా, 308 మంది మృతి

రోడ్లు, కాల్వలు వరదనీటి ప్రవాహంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లే అవకాశం ఉంది.ఢిల్లీలో గత 19 సంవత్సరాల్లో సెప్టెంబర్‌ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 1 న కురిసిన వర్షం ఢిల్లీలో దాదాపు రెండు దశాబ్దాల్లోనే నమోదైన అత్యధిక వర్షపాతం అని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనమణి చెప్పారు.వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 81 శాతం ఎక్కువ అని ఐఎండీ అధికారులు వివరించారు.