Credits: Google

New Delhi, Feb 14: దేశ రాజధానిలో అత్యాచారాల పర్వం (Delhi Shocker) ఆగడం లేదు. కదులుతున్న కారుల్లో, నిలిపి ఉంచిన కారుల్లో కామాంధులు దారుణ రేప్ లకు పాల్పడుతున్నారు. తాజాగా న్యూఢిల్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. షాపింగ్‌ మాల్‌ సెల్లార్‌లో పార్కింగ్ చేసిన కారులో ఓ యువతి అత్యాచారానికి (raped inside car in mall parking) గురైంది. తుషాక్ శర్మ అనే వ్యక్తి తనకు మత్తు మందు (Woman techie drugged) ఇచ్చి కారులో అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధిత యువతి తెలిపిన కథనం ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు తుషార్ పరిచయమయ్యాడు. ఉద్యోగం లభించేలా చేస్తానంటూ హామీ ఇచ్చాడు. గత శనివారం సహారా మాల్‌లో ఇంటర్వ్యూ ఉందంటూ ఆమెకు తెలిపాడు. అతడు చెప్పినట్టే ఆమె తన డాక్యుమెంట్స్ తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు అక్కడకు చేరుకుంది. ఈ క్రమంలో నిందితుడు ఆమెను కారులో ఎక్కించుకుని బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లాడు.

ట్యూషన్ టీచర్ హోమ్ సెక్సువల్‌ వేధింపులు, తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన పదవ తరగతి విద్యార్థి, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘటన

ఆ తరువాత అతడిచ్చిన మంచీ నీళ్లు తాగాక తాను స్పృహ కోల్పోయానని చెప్పింది. ఆ తరువాత.. తుషార్ తనను బలవంతంగా కారులోకి తోసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది.

భార్యపై అనుమానం, చిన్న పిల్లల గొంతు కోసి చంపిన కసాయి తండ్రి, కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి..

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషప్రయోగం, అత్యాచారం, నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడటం సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.