New Delhi, Feb 17: ఢిల్లీలో భారీ డ్రగ్ రాకెట్ ని పోలీసులు భగ్నం చేశారు. బస్టాండ్‌లో, రూ. 7 కోట్ల విలువైన కనీసం 30 క్యాప్సూల్స్‌ను మింగిన ఉగాండా జాతీయుడిని ఫిబ్రవరి 4న కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రాబర్ట్ సెగోంజి (Ugandan national Robert Sengonzi) రూ 7 కోట్ల విలువైన 30 హెరాయిన్ ట్యాబ్లెట్లను (swallows 30 heroin capsules) మింగేశాడు. రాబర్ట్ ఆట కట్టించిన పోలీసులు అతడిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ( IGI airport) అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 14న రాబర్ట్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రాబర్ట్ కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని అడ్డగించారు. విచారణలో భాగంగా హెరాయిన్‌తో కూడిన 30 ట్యాబ్లెట్లను మింగేశానని నిందితుడు అంగీకరించాడు. 18 క్యాప్పుల్స్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే నిందితుడు విసర్జించగా, మిగిలిన 12 క్యాప్సుల్స్‌ను రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో కక్కించారు. మొత్తం ఏడు కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను నిందితుడి నుంచి అధికారులు సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి అనంతరం తీహార్ జైలుకు తరలించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు విమానాశ్రయంలోనే 18 క్యాప్సూళ్లను విసర్జించారు. మిగతా ఇతర 12 క్యాప్సూల్స్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో తొలగించారు, దీని ఫలితంగా మొత్తం 382 గ్రాముల వైట్ కలర్ పదార్థం 7 కోట్ల రూపాయల విలువైన ( worth Rs 7 cr) హెరాయిన్ బయటపడిందని కస్టమ్ అధికారి తెలిపారు.
నిందితుడిని ఫిబ్రవరి 14న ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 43(బి) కింద అరెస్టు చేశారు. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 8లోని నిబంధనలను ఉగాండా జాతీయుడు ఉల్లంఘించాడని ఆ అధికారి తెలిపారు. NDPS చట్టంలోని సెక్షన్ 21, సెక్షన్ 23 మరియు సెక్షన్ 29 ప్రకారం నేరం శిక్షార్హమైనది. కోవిడ్ టెస్ట్ నెగెటివ్ అని తేలిన తర్వాత నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ అవసరం లేదని అధికారులు కోర్టుకు చెప్పడంతో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం నిందితుడిని తీహార్ జైలులో ఉంచారు.