New Delhi, Dec 8: దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఢిల్లీలో డిసెంబరు 5వతేదీ వరకు డెంగీ కేసులు (Dengue cases in Delhi) 100 మార్కును నమోదయ్యాయి. నవంబరు నెలలో ఢిల్లీలో 338 మందికి డెంగీ సోకింది. గతంలో కంటే ఈ ఏడాది డెంగీజ్వరాల కేసుల సంఖ్య (Dengue cases count in Delhi) తక్కువగానే ఉందని వైద్యులు చెపుతున్నారు. డిసెంబరు నెలలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీతో పాటు మలేరియా, చికున్ గున్యా జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. మొత్తంగా 2,24,106 మందికి మలేరియా, చికున్ గున్యా జ్వరాలు ప్రబలాయి.
2019లో డిసెంబరు 5వతేదీ వరకు 1884 డెంగీ కేసులు నమోదైనాయి.డెంగీ వల్ల గత ఏడాది 2,036 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. అసలే కరోనా ప్రజలు బాధపడుతుంటే మరో వైపు దోమకాటుతో మలేరియా, డెంగీ, చికున్ గున్యా జ్వరాలు ప్రబలుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ జ్వరాలకు కారణమైన దోమల బెడదను నివారించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. వెక్టర్ ద్వారా సంక్రమించే ఈ వ్యాధి నుండి ఈ ఏడాది ఢిల్లీలో ఎటువంటి మరణాలు సంభవించలేదని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్‌డిఎంసి) తెలిపింది.
మలేరియా, డెంగ్యూ మరియు చికున్‌గున్యా అనే మూడు వ్యాధులు అధిక జ్వరంతో కూడి ఉంటాయి, ఇది COVID-19 యొక్క సాధారణ లక్షణం. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వారు COVID-19 బారిన పడ్డారని అనుమానించవచ్చని వైద్యులు అంటున్నారు,