Gold Tulsi Leaves: సింహాద్రి అప్పన్నకు 50 బంగారు తులసీ ఆకులను కానుకగా సమర్పించిన భక్తుడు, సింహగిరిపై రాజగోపురం దర్శనాలకు బ్రేక్, తూర్పు కనుమల పర్వతంపై కొలువుతీరిన  శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి
devotee-offered-50-gold-tulsi-leaves-to-the-deity-at-varaha-lakshmi-narasimha-temple (Photo-ANI)

Simhachalam, November 22: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నాని(Visakhapatnam)కి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల పర్వతంపై కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రాంతం సింహాచలం (Simhachalam Temple). సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అమూల్యమైన కానుకలను సమర్పించుకుంటారు.

ఇందులో భాగంగా స్వామివారిని నిన్న ఓ భక్తుడు దర్శించుకొని విలువైన కానుకలు సమర్పించుకున్నాడు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి పత్రాల నమూనాలతో కూడిన 50 బంగారు తులసి పత్రాల(50 Gold Tulsi Leaves)ను స్వామివారికి కానుకగా సమర్పించాడు. కాగా దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం.

స్వామివారికి కానుక

అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి (Lord Varaha Lakshmi Nrusimha Swamy temple) విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.

ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.

సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో రాజగోపురం (Rajagopuram) ద్వారా దర్శనాలకు వెళ్లే పద్ధతికి స్వస్తి పలకాలని దేవస్థానం నిర్ణయించింది. వైదిక పెద్దల సూచన మేరకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి వెళ్లడం శుభకరం అన్న ఉద్దేశంతో ప్రముఖులను సైతం సుపథ మార్గం ద్వారా ఉత్తర ద్వారం నుంచి దర్శనాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు.