Flight operations: చివరి నిమిషంలో విమానాలు రద్దు, అయోమయంలో ప్రయాణికులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడంపై ఆగ్రహం
Delhi Airport (Photo Credits: PTI)

New Delhi, May 25: రెండు నెలల విరామం తర్వాత దేశీయ విమానాలు (Flight operations) సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి దశలో కొందరు ప్రయాణికులను కూడా తమ తమ గమ్య స్థానాలకు చేర్చాయి. అయితే కొన్ని విమానాలను మాత్రం ప్రయాణికులకు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండానే వాటిని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 82 విమానాలు ఆకస్మికంగా రద్దయ్యాయి. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

కాగా దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని విమానాశ్ర‌యాల నుంచి (Domestic Flights in India) దేశీయ విమాన స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని చోట్ల ఫ్ల‌యిట్ల‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌యాణికులు టికెట్ బుకింగ్ చేసుకుని ఎయిర్‌పోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఫ్ల‌యిట్లు ర‌ద్దు (flight cancelled) అయిన‌ట్లు వారికి స‌మాచారం ఇస్తున్నారు. దీంతో ఆ ప్ర‌యాణికులు ఏం చేయాలో అర్థంకాక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మేము ఢిల్లీకి వెళ్తున్నాం. మేము విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మా విమానం రద్దైందని అధికారులు చెప్పారు. కస్టమేర్ కేర్‌ను సంప్రదించగా... ఈ రాత్రికి ఓ ఫ్తైట్ ఉందని, దానికి తమను షెడ్యూల్ చేశారని చెప్పారు. కానీ... కచ్చితంగా మాత్రం చెప్పలేదు’’ అని ఓ ప్రయాణికుడు వాపోయారు.

Take a look at the tweets:

Flight Cancelled from Mumbai's Chhatrapati Shivaji International airport

Another passengers stranded at the airport with her daughter

ముంబై విమానాశ్ర‌యం నుంచి పాట్నా వెళ్ల‌వ‌లిసిన విమానాన్ని ఇవాళ ర‌ద్దు చేశారు. ఉద‌యం ప్రారంభం కావాల్సిన ఆ ఫ్ల‌యిట్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చిన వారంతా షాక‌య్యారు.బెంగుళూరులో కూడా ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తింది. బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌కు రావాల్సిన విమానాన్ని అక‌స్మాత్తుగా ర‌ద్దు చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. కేరళ, లక్నో వెళ్లాల్సిన విమానాలు ఆకస్మికంగా రద్దు కావడంతో ప్రయాణికులు అయోమయంలో మునిగిపోయారు.

Flight cancelled from Kerala

Cancellation of Ticket on Bangalore-Vizag route

ఎయిర్‌లైన్స్ నుంచి త‌మ‌కు ఎటువంటి స‌మాచారం లేద‌ని ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బోర్డింగ్ పాస్‌ల‌ను స్కానింగ్ చేస్తున్న స‌మ‌యంలో త‌మ విమానం ర‌ద్దు అయిన‌ట్లు సిబ్బంది తెలియ‌జేశార‌ని ఓ ప్ర‌యాణికుడు ఆరోపించాడు. ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇవాళ 80 ఫ్ల‌యిట్ల‌ను ర‌ద్దు చేశారు. దాంట్లో డిపార్చ‌ర్స్ , అరైవ‌ల్స్ ఉన్నాయి. ముంబై విమానాశ్ర‌యంలో 25 టేకాఫ్‌లు, 25 ల్యాండిగ్స్‌కు అనుమ‌తి ఉన్న‌ది. చెన్నైలో 25 ఫ్ల‌యిట్ల‌కు మాత్ర‌మే అరైవ‌ల్ అనుమ‌తి ఉన్న‌ది.

Overnight cancellation of ticket:

మరోవైపు కరోనా జాగ్రత్తలు, థర్మల్ స్క్రీనింగ్, ప్రయాణికులను చెక్ చేయడం లాంటి ముందస్తు చర్యల కారణంగా ప్రయాణికులు టెర్మినల్ బయటనే పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిల్చుండి పోయారు. అంతేకాకుండా వారి వారి ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారా? లేదా? అని కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.