Mumbai, September 7: వరుస భూ కంపాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై (Earthquake in Mumbai) వణికిపోతున్నది. గత శుక్ర, శనివారాల్లో ఉత్తర ముంబైలో భూమి కంపించింది. తాజాగా ఈరోజు ఉదయం 8 గంటలకు మరోసారి స్వల్పంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా (Quake of Magnitude 3.5) నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ముంబైకి 102 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఈరోజు ఉదయం 8 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. కాగా ఇటీవలే మహారాష్ట్రలోని నాసిక్, పాల్ఘర్ ప్రాంతాలలో భూకంపాలు చోటుచేసుకున్నాయి.
శనివారం ఉదయం 6.36 గంటలకు 2.7 తీవ్రతతో ముంబైకి ఉత్తరంగా భూమి కంపించింది. అందకు ముందురోజు శుక్రవారం ఉదయం 10.33 గంటలకు 2.8 తీవ్రతతో భూమి కంపించగా, అదేరోజు 11.41 గంటలకు నాసిక్‌లో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది.
కరోనావైరస్ వ్యాప్తి కల్లోలం మహారాష్ట్రలో కొనసాగుతూనే ఉంది. ఆదివారం అత్యధికంగా 23,350 కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలోని COVID-19 సంఖ్య 9,07,212 కు చేరుకుందని ఒక అధికారి తెలిపారు. 328 మరణాలు సంభవించిన తరువాత రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 26,604 కు చేరుకుందని అధికారి తెలిపారు. రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 6,44,400 కాగా, 2,35,857 మంది క్రియాశీల రోగులు ఉన్నారు. పరీక్షల సంఖ్య 4647742 అని ఆయన తెలిపారు