Representational Image (Photo Credits: ANI)

Bhopal, Jan 27: మధ్యప్రదేశ్‌లోని విదిషాలో గురువారం బీజేపీ మాజీ కౌన్సిలర్ తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విదిషాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంజీవ్ మిశ్రా (Ex-BJP councillor Sanjeev Mishra) అదే ప్రాంతానికి చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్. సంజీవ్ కొడుకు 'మస్కులర్ డిస్ట్రోఫీ' అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడని, అతన్ని రక్షించలేకపోయాడని సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కుమారుడి తీవ్ర అస్వస్థతకు గురవడంతో,, సంజీవ్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి విషం తాగడంతో (3 family members ends life) చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. పోలీసులు ఇతర బీజేపీ అధికారులతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. తన కుమారుడి అనారోగ్యం కారణంగా సంజీవ్ మిశ్రా ఇబ్బంది పడ్డాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ తెలిపారు.సంజీవ్ ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్ట్‌ను కూడా పెట్టాడు.

భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానం, మద్యం తాగించి ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి, మృతదేహాన్ని 15 ముక్కలుగా కట్ చేసిన భర్త, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాకు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్‌ సంజీవ్‌ మిశ్రా(45)కు భార్య నీలం(42), ఇదర్దు కుమారులు అన్మోల్‌(13), సార్థక్‌(7) ఉన్నారు. అయితే, గత కొద్ది రోజలుగా సంజీవ్‌ కొడుకు.. అరుదైన కండరాల వ్యాధి(muscular dystrophy)తో బాధపడుతున్నాడు. దీంతో, తన కుమారుడి ఆరోగ్యాన్ని మెరుగయ్యేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఎన్ని ఆసుపత్రుల తిరిగినా అతడిని నయం కాకపోవడంతో సంజీవ్‌ మిశ్రా మనస్థాపానికి లోనయ్యారు.

భార్య రావడం లేదని పురుషాంగం కట్ చేసుకున్న భర్త , తీవ్ర రక్త స్రావం కావడంతో ఆస్పత్రికి, కుట్లు వేసిన వైద్యులు, శృంగారానికి పనికివస్తాడా లేదా అనేది చెప్పడం కష్టమని వెల్లడి

ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి కారణంగా దంపతులు ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో తమ కుమారులిద్దరికీ విషం తాగించారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కూడా పాయిజన్‌ సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, పిల్లలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. సంజీవ్‌ మిశ్రా, నీలం మాత్రం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే, వీరి ఆత్మహత్యకు ముందు సంజీవ్‌ మిశ్రా ట్విట్టర్‌ వేదికగా.. శత్రువుల పిల్లలను కూడా దేవుడు ఈ వ్యాధి నుంచి తప్పించాలి. నేను నా పిల్లలను రక్షించలేను.. అందుకే ఇకపై జీవించాలని అనుకోవడం లేదు అంటూ కామెంట్స్‌ చేశారని పోలీసులు తెలిపారు.

మస్కిల్‌ డిస్ట్రోఫీ అంటే..

వారసత్వ (జన్యు) వ్యాధుల కారణంగా కండరాలు బలహీన పడటాన్ని కండరాల డిస్ట్రోఫీ సూచిస్తుంది. ఈ పరిస్థితిని ఒక రకమైన మయోపతి, అస్థిపంజర కండరాల వ్యాధిగా పేర్కొంటారు. ఈ‍ వ్యాధి కారణంగా, కండరాలు కుంచించుకుపోతాయి, బలహీనపడతాయి. కండరాల బలహీనత కారణంగా నడవడం, రోజువారీ కార్యకలాపాలు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ వ్యాధి గుండె, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది అరుదైన వ్యాధి. దీని కారణంగా వీల్‌ చైర్‌ కూడా పరిమితమయ్యే అవకాశం ఉంటుంది.