Chennai, July 1: తమిళనాడులో బుధవారం ఉదయం విషాదం (Tamil Nadu Plant Explosion) చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని కేంద్ర ఆధారిత థర్మల్ పవర్‌ప్లాంట్ నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్ (Boiler of Neyveli Lignite Plant) లోని రెండవ దశ బాయిలర్‌లో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఎన్ఎల్‌సీ లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. కరోనా కేసుల్లో ఢిల్లీని దాటేసిన తమిళనాడు, దేశంలో తాజాగా రికార్డు స్థాయిలో 507 మంది మృతి, 5 లక్షల 85 వేలు దాటిన కోవిడ్-19 కేసులు
ప్రస్తుతానికి పేలుడు సంభవించిన బాయిలర్ ఆపరేషన్ నిలిపివేసామని అధికారులు తెలిపారు. గత రెండు నెలల కాలంలో నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లో పేలుడు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు మే నెలలో ప్లాంట్‌లోని బాయిలర్ పేలడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Here's ANI Tweet
#UPDATE - 6 dead & 17 injured in an explosion at a boiler of Neyveli lignite plant: M. Sree Abhinav, Cuddalore Superintendent of Police https://t.co/jtaOudE9P0
— ANI (@ANI) July 1, 2020
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్(నైవెల్లి లిగ్నైట్) ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాంట్ ఉన్నది. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాయిలర్ ఆపరేషన్ ఆపేశారు. ఈ ప్రమాదం పట్ల విచారణ మొదలుపెట్టినట్లు పవర్ ప్లాంట్ అధికారి తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్లాంట్‌లో పేలుడు జరగడం ఇది రెండవసారి. మా ప్రాణాల కోసం మీ ప్రాణాలు పణంగా..,కరోనాతో విపత్తులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు, ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన ప్రధాని మోదీ
కాటీ గతంలో మే నెలల జరిగిన జరిగిన పేలుడులో 8 మంది కార్మికులకు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. రెగ్యులర్, కాంటాక్ట్ వర్కర్లు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. నైవెల్లి థర్మల్ ప్లాంట్ లో 3940 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అయితే బ్లాస్ట్ జరిగిన ప్లాంట్‌లో మాత్రం 1470 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. నైవెల్లి కంపెనీలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు ఉన్నారు. దీంట్లో 15వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తొలుత 17 మంది గాయపడినట్లు సమాచారం వచ్చింది. గాయపడ్డవారిని ఎన్ఎల్‌సీ లిగ్నైట్ హాస్పిటల్‌కు తరలించారు.