Fali Nariman & Ameen Sayani Dies (Photo-X/@sanjayuvacha)

ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ (బుధవారం) ఉదయం కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు.న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.  ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ కన్నుమూత, వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో తిరిగిరాని లోకాలకు..

ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ (Iconic Radio Presenter) అమీన్ సయానీ (Ameen Sayani) తన 91 ఏళ్ళ వయసులో కన్ను మూశారు. మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు (heart attack) గురైన అమీన్‌ను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతో ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత, బినాకా గీత్‌ మాలతో పాపులర్ అయిన రేడియో మాస్ట్రో

ఈ విషయాన్ని ఆయన కుమారుడు రజిల్‌ సయానీ (Rajil Sayani) ధృవీకరించారు. 1952 నుంచి 1994 వరకు రేడియోలో సుదీర్ఘంగా సాగిన ‘బినాకా గీత్‌ మాల’ (Binaca Geet Mala) ఆయనకు పేరొచ్చింది. 54,000 రేడియో కార్యక్రమాలు నిర్వహించి రేడియో మాస్ట్రోగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇద్దరి మరణ వార్త తెలుసుకున్న పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.