Lucknow, Feb 2: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో ఆత్మహత్యకు (Committing Suicide Live on Instagram) సిద్ధమవుతుండగా ఫేస్‌బుక్ అధికారులు (Police Officials) వెంటనే స్పందించి యూపీ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి వెంటనే అతన్ని కాపాడారు. ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభయ్ శుక్లా అనే యువకుడు ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఈ వీడియో కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం మాతృసంస్థ మెటా హెడ్‌క్వార్టర్స్‌లో కనిపించింది.
దాంతో వెంటనే స్పందించిన అక్కడి ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు చేరవేశారు. దాంతో ఆ యువకుడి (Ghaziabad Man) మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు అభయ్ శుక్లా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగారు.అమెరికా నుంచి అలర్ట్ పంపినప్పటి నుంచి పోలీసులు యువకుడి ఇంటికి వచ్చేసరికి 13 నిమిషాల సమయం (Saved in 13 Mins By Facebook) మాత్రమే పట్టింది. దాదాపు 6 గంటలపాటు శుక్లాతోపాటు అతడి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ చేసిన అనంతరం అప్పగించారు.
గురుగావ్‌లోని పాత మొబైల్స్ వ్యాపారం చేసే అతను నష్టాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రాంలో ఎవరిదైనా ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్ కనిపిస్తే వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఏడాది మార్చిలో మెటా కంపెనీతో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే.